Sunday, 27 March 2016

Aanjaneya-Dhandakamu

ఆంజనేయ దండకము         


 శ్లో !!  ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం 
                  తరునార్కప్రభాం శాన్తం రామదూతం నమామ్యహం 

శ్రీ  ఆంజనేయం ప్రసన్న  ఆంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజే వాలఘత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామ సంకీర్తనల్ జేసి నీరూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నూహించి నీమూర్తిగావించి నీ సుందరం బెంచి నీదాసదాసాను దాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్  జూచితే వేడుకల్ చేసితే నామొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయ దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచి యున్ నన్ దాతవై బ్రోచియున్ దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్మoత్రివై స్వామికార్యార్ధమై యేగి శ్రీరామ సౌమిత్రు లం జూచి వారిన్విచారించి సర్వేశు బూజించి యబ్బానుజం బంటుగావించి యవ్వాలినిన్ జంపి కాకుత్థ్స  తిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కిందకేతెంచి శ్రీరామ కార్యార్థ్ మై లంకకేతేoచి యున్ లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియున్ యబ్భూమిజo జూచి యానంద ముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషమున్ జేసి సుగ్రీవుడున్ అంగదున్ జాంబవంతున్ న్నలున్నీలునిం గూడి యా సేతువుందాటి వానరుల్ మూకలై పెన్మూకలై యాదైత్యులన్ ద్రుంచగ రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యాశక్తి నిన్  వైచి యాలక్ష్మణున్  మూర్చనొo దింపగా నప్పుడే నీవు సంజీవినిన్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి  ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులు న్వీరులంబోర శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానం దమైయుoడ నవ్వెళ నున్ విభీశణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిశేకంబు సంరంభమై యున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించె శ్రీరామభక్త ప్రశస్తoబుగా నిన్ను సేవించి నీకీర్తనల్ చేసినన్ బాపముల్ బాయవే భయములున్ దీరవే భాగ్యముల్ గల్గవే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తు లున్ గల్గునొ వానరాకార యో భక్తమందార యో పున్యసంచార యో ధీర యో వీర నీవే సమస్తంబుగానోప్పి యా తారక బ్రహ్మ మంత్రంబు పఠీయిoచి వజ్రదేహంబునున్ దాల్చి వర్తించు నీదివ్యనామoబు నా జిహ్వనుందాల్తు త్రైలోక్యసంచారివై  రామనామాoకీత ధ్యానివై బ్రహ్మతేజంబునన్ బోల్చు రౌద్రాన లేభా విరహనుమంత    హుంకారశబ్దంబులన్ భూత ప్రేతంబు లన్ బెన్ పిశాచంబులన్ శాకినీ డాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబులన్ జుట్టి నేలం బడంగొట్టి నీముష్టి ఘాతంబులన్ రోమ ఖడ్గంబులన్ ద్రుంచు కాలాగ్ని రుద్రుండవే నీవు బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబునుంజూపి రారోరి నాముద్దు నరసింహ యంచున్ దయాదృష్టి  వీక్షిoచి నన్నేలు నాస్వామి శ్రీయాంజనేయ నమస్తే సదా బ్రహ్మచారీ సదాపాపహారి నమస్తే నమోవాయుపుత్ర నమస్తే నమః 

No comments:

Post a Comment

Please share your comments here